విజయనగరం జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం.. టీడీపీ తీర్థం పుచ్చుకున్న జడ్పీ చైర్మన్ కుటుంబ సభ్యులు!

రిపోర్టర్: తాడి మురళీకృష్ణ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన కుమార్తె సిరి సహస్ర మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర బిడ్డగా ఎవరికి ఏ సహాయం కావాలన్నా సంప్రదించాలని కోరారు. ప్రజాసేవ చేయడానికే తాను ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేశారు. తమ తండ్రి చిన్న శ్రీనుతో పాటు కొండల రావు, తోట వాసు, ఒమ్మి శ్రీను టీడీపీలో చేరినట్లు ఆమె తెలిపారు.