నల్లగొండలో లింక్ రోడ్డు నిర్మాణం చేపట్టాలంటూ కంచర్ల భూపాల్ రెడ్డి డిమాండ్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: నల్లగొండ
నల్లగొండ పట్టణంలో సాగర్ రోడ్డు నుండి వెంకటరమణ కాలనీకి తక్షణమే లింక్ రోడ్డు నిర్మించాలని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో బీఆర్ఎస్ హయాంలోనే ఈ రోడ్డుకు అనుమతులు వచ్చినా పనులు పూర్తి కాలేదని ఆయన తెలిపారు. కేవలం వంద మీటర్ల మేర స్థలం కేటాయించి రహదారి నిర్మిస్తే కాలనీవాసుల ప్రయాణ ఇబ్బందులు తొలగిపోతాయని పేర్కొంటూ స్థానిక ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరారు.