అక్టోబర్ చివరి నాటికి ఏపీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు కసరత్తు

రిపోర్టర్: సతీష్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో 100 మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలకు అక్టోబర్ చివరి నాటికి ఎన్నికలు నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితా తయారీ, రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను అధికారులు ముమ్మరం చేశారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేసి, త్వరలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం ద్వారా అధికారిక షెడ్యూల్ విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీంతో రాజకీయ పార్టీలు ఎన్నికల మూడ్‌లోకి వచ్చాయి.