అపార సాహసంతో ప్రాణాలు కాపాడిన పైలట్ స్మిత్‌తో మాట్లాడిన ప్రధాని మోదీ
రిపోర్టర్: హరి
స్థలం: అబుదాబి
ఫ్లైదుబాయ్ విమానంలో తీవ్ర ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొని వందలాది ప్రాణాలను కాపాడిన భారత సంతతి పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాల్లో మాట్లాడారని అధికారులు తెలిపారు. క్లిష్ట సమయంలో ఆయన చూపిన ధైర్యసాహసాలను ప్రధాని కొనియాడారు. అబుదాబి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్మిత్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులతోనూ ప్రధాని మాట్లాడి, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ దాడి వెనుక ఉగ్రవాద కోణం ఉందనే అనుమానంతో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.