మహబూబాబాద్ జిల్లా గురుకుల పాఠశాలలో విద్యార్థినుల కొత ఘటనపై షోకాజ్ నోటీసులు

రిపోర్టర్: రాజేష్ స్థలం: Mahabubabad

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నేరడ కస్తూర్బా బాలికల గురుకుల పాఠశాలలో వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుడిని తయారు చేసిన విద్యార్థినులను ఇంగ్లిష్ టీచర్ విచక్షణారహితంగా కొట్టిన ఘటనపై జిల్లా అధికారులు స్పందించారు. ఈ ఘటనపై దిశ దినపత్రికలో వచ్చిన కథనాల ఆధారంగా జిల్లా ఇన్‌చార్జి విద్యాధికారి శ్రీరాములు సదరు టీచర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసి, మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అయితే పాఠశాలలో జరిగిన విషయాన్ని మూడు రోజుల పాటు పైఅధికారులకు తెలపకుండా ఎస్ఓ దాచిపెట్టడంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.