జపాన్ వేదికగా అట్టహాసంగా ప్రారంభం కానున్న ఆసియా క్రీడలు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: జపాన్
జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ఆసియా క్రీడలు 2026 అధికారికంగా ప్రారంభం కానున్నాయి. గత హాంగ్జౌ క్రీడల్లో సాధించిన 107 పతకాల రికార్డును మెరుగుపరచుకోవాలని భారత్ గట్టి పట్టుదలతో ఉంది. ఈ ప్రారంభ వేడుకలో స్టార్ షూటర్ మను భాకర్, షాట్ పుట్ అథ్లెట్ తాజిందర్‌పాల్ సింగ్ తూర్ భారత్ తరఫున పతాకధారులుగా వ్యవహరించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో 45 దేశాల నుంచి అథ్లెట్లు పాల్గొంటుండగా, భారత్ నుంచి పీవీ సింధు, మీరాబాయి చాను వంటి ప్రముఖులు బరిలోకి దిగుతున్నారు.