భక్తిశ్రద్ధలతో ముగిసిన మనుబోలు గణనాథుని నిమజ్జనోత్సవం
రిపోర్టర్: sankar p
స్థలం: మనుబోలు
నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని శివాలయం వద్ద ఐదు రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుని నిమజ్జనోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఐదు రోజులు పూజలందుకున్న 21 కేజీల లడ్డును 32 వేలకు ఆవుల బ్రదర్స్ దక్కించుకోగా, డబ్బుల మాల ఒలిపి శ్రీనివాసులు 20 వేలకు కైవాసం చేసుకున్నారు. నిమజ్జనోత్సవంలో డీజే మోతలు మరియు కోలాటాలతో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని సందడి చేశారు.