టెక్కలిలో రైలు రూపంలో ముంచుకొచ్చిన ఘోర విషాదం

రిపోర్టర్: శివ స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస సమీపంలో రాజ్యరాణి ఎక్స్ప్రెస్ రైలు ఐదుగురు వ్యక్తులను ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. బర్మా ప్రాంతానికి చెందిన బాధితులు ట్రాక్ దాటుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.