వైసీపీ అరాచక పాలనపై జనసేన తీవ్ర ఆగ్రహం: భయభ్రాంతులకు గురిచేసే కుట్ర

రిపోర్టర్: మహేష్ స్థలం: Andhra Pradesh

అధికారంలో ఉన్నప్పుడు సాగించిన అరాచకాలను వైఎస్సార్సీపీ నేతలు ఇప్పుడు మళ్లీ కొనసాగిస్తున్నారని, ఓటమి భయంతోనే ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే కుట్రలకు తెరలేపారని జనసేన పార్టీ వెల్లడించింది. రాజమండ్రిలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ఫ్యాక్షన్ రాజకీయాలను మళ్లీ రెచ్చగొట్టేలా ప్రతిపక్ష పార్టీ తీరు ఉందని ఆ పార్టీ మండిపడింది. ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాల్సిన వారు ఇలాంటి చర్యలకు పాల్పడటం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేసింది.