శేరిలింగంపల్లి గురుకుల భూముల కబ్జాపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర నిప్పులు

రిపోర్టర్: సతీష్ స్థలం: Hyderabad

హైదరాబాద్ శేరిలింగంపల్లిలో వెయ్యి కోట్ల విలువైన గురుకుల భూములను కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ కబ్జా చేస్తున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండతోనే రాష్ట్రంలో భూ దోపిడీలు జరుగుతున్నాయని మండిపడ్డారు. పది రోజుల్ లో భూమిని సాంఘిక సంక్షేమ శాఖకు అప్పగించకపోతే వేలాది మందితో సంక్షేమ భవ ముట్టడిస్తామని హెచ్చరించారు.