బొబ్బిలి పురపాలక సంఘం చైర్మన్ అభ్యర్థిగా మువ్వల పద్మ ముమ్మర ప్రచారం

రిపోర్టర్: GANESH BBL స్థలం: బొబ్బిలి

విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో ఇందిరమ్మ కాలనీలో కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి మువ్వల పద్మ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ హస్తం గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సహకారంతో ప్రజల ముందుకు వచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు మువ్వల శ్రీనివాసరావు, పడాల శేషగిరిరావు తదితరులు పాల్గొని భారీ విజయం సాధించాలని పిలుపునిచ్చారు.