టెక్ రంగంలో లేఆఫ్స్ కలకలం: కొత్త ఉద్యోగులకు బాధ్యతలు అప్పగిస్తూ తీవ్ర ఆందోళన
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగ భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయని, తనకు ఎలాంటి పనులు కేటాయించకుండా కొత్తవారికి బాధ్యతలు ఇస్తున్నారని ఓ ఉద్యోగి సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారని టెక్ నిపుణులు తెలిపారు. గత కొంతకాలంగా స్ప్రింట్ ప్లానింగ్‌లో తనను పూర్తిగా విస్మరిస్తున్నారని, కొత్త ఉద్యోగులకు శిక్షణ ఇప్పించుకుంటూ తనను తొలగించేందుకు సంస్థ కుట్ర పన్నుతోందని సదరు టెక్ ఉద్యోగి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.