కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ నిరసన: వంటావార్పుతో నిరసన గళం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Telangana
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయినా, ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. ఈ వైఫల్యాలను ఎండగడుతూ రాష్ట్రవ్యాప్తంగా వంటావార్పు కార్యక్రమాలతో తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్‌పై పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.