స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై ఎన్నికల సంఘం స్పష్టత

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: New Delhi

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియతో సహా ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలన్నీ ముగ్గురు ఎన్నికల కమిషనర్ల ఆమోదంతో ఏకగ్రీవంగానే జరిగాయని ఈసీ వర్గాలు స్పష్టం చేశాయి. ఈసీలో అంతర్గత విభేదాలు ఉన్నాయని వస్తున్న మీడియా కథనాలను పూర్తిగా ఖండించాయి. కమిషనర్లకు వ్యక్తిగత అభిప్రాయాలు ఉండవచ్చునని, అయితే నిర్ణయాలన్నీ అందరి ఆమోదంతోనే ఏకగ్రీవంగా తీసుకున్నామని స్పష్టం చేయడంతో పాటు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఇతర కమిషనర్లపై వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చాయి.