తిరుపతిలో శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీ మరో నాలుగు రోజులు పొడిగింపు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: తిరుపతి

తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్‌ కేంద్రాల్లో శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీని ఈ నెల 24 వరకు నిలిపివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. తొలుత ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు టోకెన్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించగా తాజాగా మరో నాలుగు రోజులు పొడిగించారు. ఈ నిర్ణయం గురించి ముందస్తు సమాచారం లేకపోవడంతో ఆదివారం ఉదయమే కేంద్రాలకు చేరుకున్న భక్తులు నిరాశతో నేరుగా తిరుమలకు బయలుదేరి వెళ్లారు.