పెళ్లి తిరస్కరించిందని లా విద్యార్థిని హత్య చేసిన నిందితులు
రిపోర్టర్: అశోక్
స్థలం: బెంగళూరు
బెంగళూరులోని కోడిహళ్లిలో పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందనే కోపంతో ఇరవై రెండేళ్ల లా విద్యార్థిని అమృతను ధనుష్, సూర్య అనే ఇద్దరు అన్నదమ్ములు దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశారు. జూలై 13న జరిగిన ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అమృత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జూలై 15న మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన జీవన్ భీమా నగర్ పోలీసులు నిందితులు ఇద్దరినీ అరెస్టు చేశారు.