ఖమ్మంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఆయుధ పూజ

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం పట్టణంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఆయుధ పూజ కార్యక్రమం చేపట్టారు. చాగంటి వెంకటేశ్వర్లు మేకపోతును వదలి పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. పగడాల మల్లేష్, పిట్టల వెంకట నర్సయ్య, రావుల హనుమంతరావు పాల్గొని ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘం నాయకులు పాల్గొన్నారు.