రాజ్యాంగ విలువలను కించపరిచే వ్యాఖ్యలు సహించేది లేదు.. ఎమ్మెల్సీ తాతా మధు తీరుపై DHPS తీవ్ర ఆగ్రహం!
రిపోర్టర్: amudala Venkanna
స్థలం: ఖమ్మం అర్బన్
తెలంగాణ శాసనసభ స్పీకర్‌పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ DHPS ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి యంగల ఆనందరావు వైరాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్‌ను అవమానించడం ప్రజాస్వామ్యాన్ని కించపరచడమేనన్నారు. తాతా మధు వెంటనే క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో దళిత, ప్రజాస్వామిక సంఘాలతో కలిసి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో యామాల గోపాలరావు, గారపాటి అశోక్, కడారి రాజేష్ పాల్గొన్నారు.