యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీల భయం

రిపోర్టర్: కిరణ్ స్థలం: India

యూపీఐ ద్వారా రూ. 2,000 కంటే ఎక్కువ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ ఛార్జీల విధింపుపై వినియోగదారుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ రుసుములు వ్యాపారులకే వర్తిస్తాయని కేంద్రం స్పష్టం చేసినా, క్షేత్రస్థాయిలో వ్యాపారులు డిజిటల్ పేమెంట్లను నిరాకరించే లేదా ఆ భారాన్ని వినియోగదారులపై మోపే అవకాశముందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.