నెల రోజుల్లోగా వీవో భవన నిర్మాణం పూర్తి చేయాలి జడ్పీ సీఈఓ నాగలక్ష్మి

రిపోర్టర్: రాము స్థలం: భద్రాద్రి కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోబానగర్ గ్రామంలో జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి శనివారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పారిశుధ్య నిర్వహణను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణ దశలో ఉన్న వీవో భవన పనుల్లో వేగం పెంచి నెల రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే స్థానిక పాఠశాలను సందర్శించి విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.