రుక్మిణి వసంత్ కొత్త సినిమా ప్రకటన: తార పాత్రలో అలరించనున్న కథానాయిక
రిపోర్టర్: సునీల్
స్థలం: హైదరాబాద్
ఒకే ఒక జీవితం ఫేం శ్రీకార్తీక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ కథానాయికగా ఓ చిత్రం తెరకెక్కనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రోడ్ ట్రిప్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ కామెడీ డ్రామా చిత్రాన్ని సిరుని సినీ కార్పొరేషన్, మ్యాడ్బాయ్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ తారా అనే కీలక పాత్రలో నటిస్తున్నట్లు తాజాగా విడుదల చేసిన అనౌన్స్మెంట్ వీడియో ద్వారా చిత్ర బృందం స్పష్టం చేసింది.