యాదగిరిగుట్టలో ఉద్యమకారుల ఆవిర్భావ దినోత్సవం జయప్రదం చేయాలని పిలుపు
రిపోర్టర్: KOLA MAHESH
స్థలం: నారాయణపురం
ఈనెల 27న యాదగిరిగుట్టలో జరిగే ఉద్యమకారుల ఫోరం ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జయప్రదం చేయాలని రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న, ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు శీలం స్వామి పిలుపునిచ్చారు. నారాయణపురంలో గోడపత్రికలు ఆవిష్కరించి, రాష్ట్ర నలుమూలల నుండి ఉద్యమకారులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.