కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై రాహుల్ గాంధీ నిప్పులు

రిపోర్టర్: అశోక్ స్థలం: New Delhi

ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తీరుపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్నికల సంఘంపై వ్యక్తమవుతున్న విమర్శల నేపథ్యంలో ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సంస్థ పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేశారు. జ్ఞానేశ్ కుమార్ను తొలగించాలని కోరుతూ కాంగ్రెస్ శ్రేణులు నగరంలో పోస్టర్లు ఏర్పాటు చేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.