ఈసీ నిర్ణయంపై రాహుల్ గాంధీ నిప్పులు: సీజేపీతో పొత్తుకు అడుగులు

రిపోర్టర్: హరి స్థలం: న్యూఢిల్లీ

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ నిర్ణయంపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు ప్రత్యేకంగా ఆహ్వానం అందించి, ఆయనతో భేటీ కావాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ పేర్కొంది. రాజ్యాంగ పరిరక్షణ కోసం సాగుతున్న ఆందోళనల్లో అన్ని శక్తులను కలుపుకుపోవాలని రాహుల్ గాంధీ స్పష్టం చేశారని, తద్వారా జాతీయ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయని విశ్లేకులు అభిప్రాయపడ్డారు.