విశాఖలో కోట్ల విలువైన ప్రభుత్వ భూముల కబ్జాకు వైకాపా నేతల పన్నాగం

రిపోర్టర్: సునీల్ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం గండిగుండంలో రెవెన్యూ రికార్డుల లోపాలను ఆసరాగా చేసుకుని కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు వైకాపా నేతలు పన్నాగం పన్నారు. సర్వే నంబరు 172 పరిధిలోని సుమారు రెండు ఎకరాల భూమిని ఆక్రమించి కంటైనర్లు ఏర్పాటు చేసి వాణిజ్య స్థలాలుగా విక్రయించేందుకు వ్యూహం పన్నారు. నకిలీ పత్రాలు సృష్టించి ఫ్రీహోల్డ్‌కు యత్నించడంతో పాటు చెరువులను కప్పేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.