అంతర్జాతీయ మార్కెట్లో భారీగా పెరిగిన ముడి చమురు ధరలు
రిపోర్టర్: రాజేష్
స్థలం: ఇండియా
అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా దూసుకెళ్లాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 107.25 డాలర్లకు చేరుకోగా, డబ్ల్యూటీఐ క్రూడ్ 101.98 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మధ్యప్రాచ్యంలో సరఫరా నిలిచిపోతుందనే భయాలతో ఇంధన ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామం భారత్‌పై తీవ్ర ఆర్థిక భారం మోపే ప్రమాముంది.