రేవంత్ సర్కార్ భూ దోపిడీపై కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌లో జరిగిన మహాధర్నాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం 22ఏ జాబితాను ఆయుధంగా వాడుకుని 60 లక్షల ఎకరాల భూములను ఆక్రమించుకుంటోందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని 'ఆర్ఆర్ రియల్ ఎస్టేట్' సంస్థగా మార్చేశారని, 30 శాతం కమీషన్ల కోసమే పేదల భూములను నిషేధిత జాబితాలో చేర్చారని ఆరోపించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు భాజపా పోరాటం ఆపేది లేదని ఆయన హెచ్చరించారు.