ఈ20 పెట్రోల్ వల్ల వాహనాలు దెబ్బతినడం లేదు: మంత్రి పొన్నం

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

ఈ20 ఇంధనం వాడకం వల్ల వాహనాలు దెబ్బతింటున్నాయన్న ప్రచారంలో వాస్తవం లేదని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనసభలో స్పష్టం చేశారు. ఇప్పటివరకు తమ శాఖకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని తేల్చిచెప్పారు. కేంద్ర ప్రభుత్వ వైఖరితో ఏకీభవించిన ఆయన, ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వల్ల ఇంజన్లు పాడవుతున్నట్లు ఎటువంటి ప్రతికూల నివేదికలు లేవని స్పష్టం చేశారు.