పెదకాకాని మండలంలో కూటమి విజయమే లక్ష్యమంటూ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పిలుపు
రిపోర్టర్: గోపి
స్థలం: గుంటూరు
పెదకాకాని మండలంలో కూటమి విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పిలుపునిచ్చారు. ప్రతి ఎంపీటీసీ స్థానంలో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలని ఆయన సూచించారు. వ్యక్తిగత విభేదాలు పక్కనపెట్టి ఇంటింటి ప్రచారం నిర్వహించాలని, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలను ప్రజలకు వివరించాలని ఆయన స్పష్టం చేస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.