శృంగవరపుకోటలో కోకా కోలా యూనిట్: రూ.842 కోట్లతో భారీ పరిశ్రమ ఏర్పాటు
రిపోర్టర్: వెంకట్
స్థలం: శృంగవరపుకోట
శృంగవరపుకోట మండలం చీడిపాలెం వద్ద జేఎస్‌డబ్ల్యూ పారిశ్రామిక పార్కులో హిందుస్థాన్ కోకా కోలా బెవరేజెస్ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు రూ.842 కోట్ల వ్యయంతో ఈ యూనిట్‌ను నిర్మించనున్నారు. దీని ద్వారా 125 మందికి నేరుగా ఉపాధి లభిస్తుందని సంస్థ ప్రతిపాదించింది. వచ్చే ఏడాది జనవరిలో పనులు ప్రారంభించి రెండు విడతల్లో ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయనున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయని అధికారులు తెలిపారు.