నాసిక్‌లో భారీగా పాకిస్థాన్ ఎండు ఖర్జూరాలు స్వాధీనం

రిపోర్టర్: వెంకట్ స్థలం: మహారాష్ట్ర

మహారాష్ట్రలోని నాసిక్‌లో డీఆర్‌ఐ అధికారులు జరిపిన ఆపరేషన్ డీప్ మ్యానిఫెస్ట్‌లో భారీ అక్రమం వెలుగుచూసింది. నిషేధిత పాకిస్థాన్‌కు చెందిన 362 మెట్రిక్ టన్నుల ఎండు ఖర్జూరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. యూఏఈ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి ఈ దందాను నడిపిస్తున్న ముంబై దిగుమతి సంస్థపై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.