విజయనగరం నగరపాలక సంస్థ ఎన్నికల పోలింగ్ తేదీ మార్పు

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: విజయనగరం

విజయనగరం నగరపాలక సంస్థ ఎన్నికల పోలింగ్ తేదీని ఈ నెల ఇరవై తొమ్మిదికి మార్పు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. పైడితల్లి అమ్మవారి సిరిమాను జాతర నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల ముప్పైవ తేదీనే కౌంటింగ్ ప్రక్రియ యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు.