నిజామాబాద్లో ఘనంగా గోర్ బంజారా తీజ్ ఉత్సవాలు

రిపోర్టర్: ASIF reporter స్థలం: నిజామాబాద్ రూరల్

నిజామాబాద్ రూరల్ పరిధిలోని జేఎన్టీయూహెచ్ క్యాంపస్లో విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గోర్ బంజారా తీజ్ పండుగను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ కోఆర్డినేటర్ జరుప్ల గోవిందు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తీజ్ పండుగ యొక్క సాంస్కృతిక విశిష్టతను, ప్రకృతితో మానవుడికి ఉన్న అనుబంధాన్ని వక్తలు వివరించారు. బంజారా సంప్రదాయాలను ప్రతిబింబించేలా సాగిన ఈ వేడుకలు విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపాయి. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రతినిధులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.