దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: సికింద్రాబాద్
హైదరాబాద్లోని బేగంపేట హోటల్ టూరిజం ప్లాజాలో నిర్వహించిన జాతీయ ఓబీసీ సదస్సులో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2027లో చేపట్టబోయే జనాభా లెక్కల సేకరణలో ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ కేటాయించి, దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బీసీల చట్టబద్ధమైన హక్కుల పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ఐక్య పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సావంత్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.