క్రేజీ ప్రాజెక్ట్: విజయ్ సేతుపతి స్లమ్‌డాగ్ చిత్రం షూటింగ్ పూర్తి
రిపోర్టర్: సతీష్
స్థలం: హైదరాబాద్
క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం స్లమ్‌డాగ్ సినిమా షూటింగ్ పూర్తిగా పూర్తయినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ప్రేక్షకులను భావోద్వేగాల సుడిగండంలోకి తీసుకెళ్లేలా ఈ సినిమా ఉండబోతోందని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.