తెలంగాణ విమోచన దినాన జాతీయ జెండా ఆవిష్కరించిన కల్పన యాదవ్

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో భాజపా ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షురాలు కడారి కల్పన ఐలయ్య యాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. 1948 సెప్టెంబరు 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన చారిత్రక ఘట్టాన్ని నాయకులు స్మరించుకున్నారు. ఈ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు, కౌన్సిలర్లు మరియు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.