ఉత్తమ జర్నలిస్టు అవార్డుల దరఖాస్తు గడువు అక్టోబర్ అయిదు వరకు పొడగింపు

రిపోర్టర్: సతీష్ స్థలం: విజయవాడ

ఉత్తమ జర్నలిస్టు అవార్డుల దరఖాస్తు గడువును అక్టోబర్ 5వ తేదీ వరకు పొడిగించినట్లు సమాచార పౌరసంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్. విశ్వనాథన్ తెలిపారు. అర్హులైన జర్నలిస్టులు అక్టోబర్ ఐదు సాయంత్రం ఐదు గంటలలోగా విజయవాడలోని శాఖ కార్యాలయానికి దరఖాస్తులు పంపాలని ఆయన పేర్కొన్నారు. కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు అవార్డుకు రెండు లక్షలు, ఇతర విభాగాల విజేతలకు లక్ష రూపాయల చొప్పున నగదు పురస్కారం అందజేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. పూర్తి వివరాలను అధికారిక వెబ్సైట్లో పరిశీలించవచ్చని అధికారులు వెల్లడించారు.