'ప్రజా పాలనతోనే రాష్ట్ర అభివృద్ధి': డిప్యూటీ సీఎం భట్టి
రిపోర్టర్: రాము
స్థలం: తెలంగాణ
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ విముక్తి కోసం పోరాడిన యోధుల త్యాగాలను స్మరించుకున్నామన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నామని మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. మహాలక్ష్మి వంటి పథకాలతో ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్నామని స్పష్టం చేశారు.