ఇంటింటికీ తిరిగి పెన్షన్ దరఖాస్తులను పరిశీలించిన అధికారులు

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన పెన్షన్ పథకంలో భాగంగా జన్నారం గ్రామంలో పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న మహిళలను ఎంపీడీవో ఉమర్ షరీఫ్ గురువారం సాయంత్రం ఇంటింటికీ తిరుగుతూ విచారించారు. కార్యదర్శి శ్రీపాల్తో కలిసి దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులో నమోదు చేసిన వివరాలను పరిశీలించి, వాస్తవాలను ఆన్లైన్లో నమోదు చేశారు.