నడిసంద్రంలో బోటు బోల్తా: థర్మాకోల్ షీట్లతో రెండు రోజులు సముద్రంలో గడిపిన అయిదుగురు మత్య్సకారులు

రిపోర్టర్: హరి స్థలం: ముత్తుకూరు

సముద్ర అలల ఉగ్రరూపానికి బోటు మునిగిపోవడంతో నడిసంద్రంలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడిన అయిదుగురు మత్య్సకారులు క్షేమంగా ఒడ్డుకు చేరినట్లు దుగరాజపట్నం కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు తెలిపారు. బాపట్ల మరియు కాకినాడ జిల్లాలకు చెందిన రమణయ్య, కొండయ్య, జగన్నాథం, అప్పారావు, పోలరాజు అక్టోబర్ 29న వేటకు వెళ్లి కొత్తపట్నం వద్ద విశ్రమిస్తుండగా బోటు బోల్తా పడింది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రెండు రోజుల పాటు థర్మాకోల్ షీట్ల ఆసరాగా సముద్రంలో గడిపిన వారిని తమిళనాడు వేటగాళ్లు మరియు కోస్టల్ పోలీసులు రక్షించి ఆసుపత్రికి తరలించారు.