వైద్య సేవలందించడంలో వైద్య సిబ్బంది అంకితభావం చూపాలని పిలుపు

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: కొమరాడ

కొమరాడ మండలంలో ప్రజారోగ్య పరిరక్షణ ధ్యేయంగా వైద్య సేవలందించాలని ఆర్బీఎస్కే జిల్లా అధికారి డాక్టర్ జగన్ మోహన్ సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి ఆశా డే కార్యక్రమంలో పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా హైరిస్క్ ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ఆరోగ్య సమస్యలను సకాలంలో గుర్తించి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి స్పష్టం చేశారు.