భారీ వర్షాలకు పొలాలు కొట్టుకుపోతుండటంతో ఆందోళనలో రైతులు
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: జీ.కె.వీధి
అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం ఏ.బులం పంచాయతీ కట్టువీధి గ్రామంలో కురుస్తున్న భారీ వర్షాలకు స్థానిక వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ వరద ఉధృతికి సమీపంలోని పంట పొలాలు పూర్తిగా కొట్టుకుపోతుండటంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి జరిగిన పంట నష్టాన్ని పరిశీలించి, ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.