వైభవ్ సూర్యవంశీని పక్కన పెట్టడంపై మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ప్రశ్న

రిపోర్టర్: గోపి స్థలం: న్యూఢిల్లీ

న్యూజిలాండ్తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్లో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీని తుది జట్టు నుంచి తప్పించడంపై మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జట్టులో అతడి పాత్ర మరియు భవిష్యత్తు ప్రణాళికలపై యాజమాన్యం స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. గాయపడిన ఆటగాళ్లకు ప్రత్యామ్నాయంగా మాత్రమే వైభవ్ను పరిగణించకూడదని, అతడికి రెగ్యులర్ అవకాశాలు లేకపోతే దేశీయ రంజీ క్రికెట్ ఆడటానికి పంపాలని చోప్రా సూచించారు.