గణేష్ మండపాల ఏర్పాటుకు ఆన్లైన్లో దరఖాస్తు తప్పనిసరి

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ఇరవై తొమ్మిది గ్రామపంచాయతీల పరిధిలో గణేష్ మండపాల నిర్వాహకులు అనుమతి కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఎస్సై ఉదయ్ కిరణ్ సూచించారు. దరఖాస్తు చేసిన అనంతరం జిరాక్స్ కాపీని పోలీస్ స్టేషన్లో అందజేయాలని తెలిపారు. నిబంధనలు తప్పక పాటించాలని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మండపాలను విద్యుత్ తీగలకు దూరంగా ఏర్పాటు చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.