యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్య హుండీ ఆదాయం రూ.18 లక్షలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: యాదగిరిగుట్ట

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు గురువారం రూ.18,07,332 ఆదాయం సమకూరినట్లు ఈవో భవానీ శంకర్ వెల్లడించారు. అందులో ప్రసాదాల ద్వారా రూ.4,34,970, విఐపి దర్శనాలతో రూ.1,07,550, బ్రేక్ దర్శనాలతో రూ.83,700, కార్ పార్కింగ్ ద్వారా రూ.1,02,500, లీజుల రూపంలో రూ.8,93,520 తదితర విభాగాల నుంచి వచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు.