ఆసియా పారా గేమ్స్: స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించిన సిమ్రాన్ శర్మ
రిపోర్టర్: రాజేష్
స్థలం: మహబూబ్ నగర్
ఆసియా పారా గేమ్స్ మహిళల వంద మీటర్ల టి టెవెల్వ్ ఈవెంట్లో సిమ్రాన్ శర్మ స్వర్ణ పతకం సాధించి అరుదైన చరిత్ర సృష్టించారని డి.కె. అరుణ - ఎంపీ మహబూబ్ నగర్ కొనియాడారు. ఈ పోటీలో ఆమె రికార్డును బద్దలు కొట్టి అద్భుతమైన ప్రతిభ కనబరిచారని పేర్కొన్నారు. ఈ ఘనవిజయంతో దేశవ్యాప్తంగా క్రీడాభిమానులు అందరూ ఎంతో గర్వపడుతున్నారని, ఆమె భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షిస్తూ డి.కె. అరుణ - ఎంపీ మహబూబ్ నగర్ అభినందనలు తెలిపారు.