రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతున్న కాంగ్రెస్: బీజేపీ తెలంగాణ ధ్వజం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Telangana
రాజ్యాంగబద్ధ సంస్థలను అపహాస్యం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని బీజేపీ తెలంగాణ అధికారికంగా వెల్లడించింది. పార్టీ ఫిరాయింపులను ఒకవైపు ప్రోత్సహిస్తూనే మరోవైపు రాజ్యాంగ స్ఫూర్తి గురించి మాట్లాడటం హేయమని మండిపడింది. మజ్లీస్ పార్టీతో అంటకాగుతూ రాజ్యాంగ ప్రక్రియలను తప్పుపట్టడం కాంగ్రెస్ వైఖరికి నిదర్శనమని ఆ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ప్రజాస్వామ్య వ్యవస్థలను నీరుగారుస్తున్న కాంగ్రెస్ నాయకుల ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని ఆరోపించారు.