ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి దుర్ఘటనపై కాంగ్రెస్ సర్కార్‌పై ఆగ్రహం
రిపోర్టర్: వెంకట్
స్థలం: ఆదిలాబాద్
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్ జరిగి పసికందులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని, ఇది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరిగిన ఘోరమని నేతలు మండిపడ్డారు. అత్యంత కీలకమైన చిన్న పిల్లల వార్డును ఎటువంటి పర్యవేక్షణ లేకుండా గాలికి వదిలేయడం వల్లే ఈ ప్రాణ నష్టం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.