తీవ్ర వాయుగుండం హెచ్చరికతో శ్రీకాకుళం జిల్లా పోలీసుల అప్రమత్తత

రిపోర్టర్: మహేష్ స్థలం: శ్రీకాకుళం

తీవ్ర వాయుగుండం మరియు భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా పోలీసులు పూర్తిగా అప్రమత్తమయ్యారు. ముంపు ప్రాంతాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా రెండు ఎస్‌డీఆర్‌ఎఫ్, ఒక ఎన్‌డీఆర్‌ఎఫ్‌తో పాటు పదిహేడు ప్రత్యేక బలగాలను రంగంలోకి దించారు.