టెక్కీలకు బంపర్ ఆఫర్: డిగ్రీ లేకున్నా కోట్లలో జీతం ఇవ్వనున్న గూగుల్
రిపోర్టర్: సురేష్
స్థలం: Hyderabad
డిగ్రీ అర్హత అవసరం లేకుండానే కోట్లలో జీతం అందించే ఉద్యోగ ప్రకటనను గూగుల్ డీప్‌మైండ్ విడుదల చేసినట్లు గూగుల్ ఇంజనీర్ తమేయ్ బెసిరోగ్లు తెలిపారు. పోలారిస్ టీమ్ కోసం ఏఐ కోడింగ్ ఏజెంట్లను పరీక్షించే ఇంజనీర్లను నియమిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి సుమారు నాలుగు కోట్ల రూపాయల నుండి పది కోట్ల రూపాయల వరకు వార్షిక వేతనం లభిస్తుందని వెల్లడించారు. సమస్యలను పరిష్కరించే నైపుణ్యమే ముఖ్యమని కంపెనీ స్పష్టం చేసింది.